చిత్రం సీక్వెల్లో ఎన్టీఆర్ బావ మరిది.. లాంచింగ్‌కు గెస్ట్‌గా జూనియర్

ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 21 ఏళ్ల తరువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 పేరుతో రూపొందనుందంటూ దర్శకుడు తేజ ఈ మధ్య అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తేజ దగ్గరే యాక్టింగ్‌కు సంబంధించి ఓనమాలు నేర్చుకున్న నితిన్ ఇప్పుడు చిత్రం 1.1 పేరుతో ప్రేక్షకులని పలకరించనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 18న మూవీ లాంచ్ కార్యక్రమం జరగనుండగా, ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. కాగా 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రలలో చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సీక్వెల్ కోసం 40 మంది కొత్త నటీనటులని ఎంపిక చేసిసినట్టు తెలుస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

