ఈ సినిమా అనీష్ రియల్ గట్స్‌కి నిదర్శనం
అనీష్ని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఇట్లు అర్జున’.
అనీష్ని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ కథానాయిక. మహేశ్ ఉప్పల దర్శకుడు. వెంకీ కుడుముల నిర్మాత. ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఈసినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా తన ఎక్స్ వేదికగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు అందించారు.
‘ఒక్కమాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్‌కి నిదర్శనం. నీ మొదటి సినిమాకే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం చూస్తుంటే.. అన్నింటికంటే కథపై నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. నీకు అద్భుతమైన ఆరంభం లభించాలని కోరుకుంటున్నా బ్రదర్.. ఈ నెల 13న రానున్న మీ సినిమాకు నా శుభాకాంక్షలు’ అని తారక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. పోలీసుల వేటతో ట్రైలర్ మొదలైంది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్లాన్‌తో గాలిస్తుంటారు. ఈ విచారణలోకి అర్జున్ అనే మూగ యువకుడు ఎంటరవుతాడు. మాట్లాడలేకపోయినా, అసాధరణమైన తెలివితేటలు అతని సొంతం. కీర్తి అనే అమ్మాయిపై అతనికి చెప్పలేనంత ప్రేమ. ఈ జంట ప్రమాదంలో చిక్కుకోవడం.. ఓ మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, వెయ్యికోట్ల డీల్.. ఇలా ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్ సాగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

