కాంగ్రెస్ సర్కార్ బీసీల వ్యతిరేకి
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 14ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
- మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ దాసోజు బహిరంగ లేఖ
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 14ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ జీవో బీసీ వ్యతిరేక, ఫ్యూడల్ ఆధిపత్య అహంకారంతో కూడుకున్న రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వని మండిపడ్డారు.
భవనాలపై ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటి పూర్తి నిర్వహణ బాధ్యతలను, అధికారాలను బీసీ కుల సంఘాలకే అప్పగించాలని స్పష్టంచేశారు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడాలు కావని, శతాబ్దాలుగా అణచివేత, వివక్షను ఎదురొన్న వృత్తి కులాలకు రాజధాని హైదరాబాద్‌లో సొంత గూడు, గొంతు ఉండాలనే ఆకాంక్షకు ప్రతీకలని దాసోజు శ్రవణ్ పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

