‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను పూర్తిచేసుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి పారిస్ విహారయాత్రలో ఉన్నారు. విరామ సమయాన్ని తన కుమారులతో ఆస్వాదిస్తున్నారు. పెద్ద కుమారుడు అభయ్‌రామ్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను ఎన్టీఆర్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. గారాల తనయున్ని ఆప్యాయంగా హత్తుకొని ముద్దాడుతుండగా…బ్యాక్‌గ్రౌండ్‌లో చారిత్రక ఈఫిల్ టవర్ కనిపిస్తున్నది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. ‘కనులకు విందైన ఈఫిల్ టవర్’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ను జత చేశారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న విడుదలకానుంది.