NTA | ఆన్సర్ కీపై సవాలు చేయడానికి వసూలు చేసే రుసుము చాలా ఖరీదైనది (Too Expensive) అని అభ్యర్థులు ఆందోళన వెలిబుచ్చతున్నారు. దీనిపై స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే విద్యార్థి కోసమే కాకుండా అభ్యర్థులందరికీ ఉన్న నిజమైన సందేహాలను సరిదిద్దేందుకే రుసుము వసూలు చేస్తున్నామని వివరణ ఇచ్చింది. ఒక అభ్యర్థి ఒక ప్రశ్నపై అభ్యంతరం చెబితే, దాన్ని సబ్జెక్ట్ నిపుణులు సరైనదని భావిస్తే సవరించిన జవాబు కీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ వర్తిస్తుందని ఎన్టీఏ వెల్లడించింది.
అభ్యర్థి వెల్లడించే అభ్యంతరం సరైనదైతే ఆ అభ్యర్థి నుంచి వసూలు చేసిన రుసుము (Fee)ను తిరిగి ఇచ్చేస్తామని ఎన్టీఏ పేర్కొంది. ఎన్ని ప్రశ్నలపై అభ్యంతరాలు లేవనెత్తితే అవన్నీ సరైనవైతే అన్ని ప్రశ్నల రుసుము మొత్తం చెల్లిస్తామని తెలిపింది. ఇది కేవలం తప్పుడు అభ్యంతరాలను నిరోధించడానికి మాత్రమే ఈ ఫీజు వసూలు చేస్తున్నాం. కానీ డబ్బులు సంపాదించడానికి కాదు అని చెప్పింది.
పీహెచ్డీ, జేఆర్ఎఫ్కు సంబంధించిన సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (NET) ఎంట్రన్స్ పరీక్ష ప్రాథమిక కీను ఎన్టీఏ ఇటీవల విడుదల చేసింది. ఈ కీలో ఏదైనా సమాధానం తప్పుగా ఉందనుకుంటే ప్రతి ప్రశ్నకు రూ. 200 చెల్లించి అభ్యర్థులు అభ్యంతరాలు తెలిజేయవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ఇది చాలా ఖరీదు అంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి తను పొలిటికల్ సైన్స్ రాశాను. దానిలో 14 ప్రశ్నలపై అభ్యంతరం తెలపాలంటే రూ. 2800 అవుతుందని అభిప్రాయం వెలిబుచ్చింది. దీంతో ఈ ఆందోళనపై స్పందించిన ఎన్టీఏ పై విధంగా వివరణ ఇచ్చింది.