నీట్ యూజీ 2022 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ఆబ్జెక్షన్కు రేపటి (సెప్టెంబర్ 2)తో గడువు ముగియనుంది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలు, రికార్డెడ్ రెస్పాన్సెస్తోపాటు స్కాన్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో ఉంచింది. నీట్ యూజీ 2022 రాసిన అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి ఆన్సర్ కీలను చూసుకోవచ్చు. అలాగే, ఇందుకు సంబంధించిన అభ్యంతరాలేమైనా ఉంటే సవాల్ చేయవచ్చు.
ఏదైనా సమాధానాన్ని సవాల్ చేయాలనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సవాల్ చేయదలుచుకున్న ఒక్కో ప్రశ్నకు రూ. 200 చెల్లించాలి. ఈ మొత్తాన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం ద్వారా 02 సెప్టెంబర్ 2022 వరకు (రాత్రి 11:50 గంటలు) చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ రుసుము రసీదు లేకుండా ఏ సవాలునూ స్వీకరించబోరు. సవాళ్లు ఏ ఇతర మోడ్ ద్వారా అంగీకరించబోమని ఎన్టీఏ నోటిఫికేషన్లో తెలిపింది. నీట్ ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేసే అవకాశముందని ఎన్టీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి.