Coffee Shop | ప్రతీది ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోతున్నది. కాఫీ షాప్‌లు కూడా అందుకుమినహాయింపు కాదు. ఒకప్పుడు అక్కడ.. మహా అయితే రకరకాల కాఫీలు దొరికేవి. ఇప్పుడు, కప్పు కాఫీతోపాటు పైకప్పు మొదలు గోడల వరకు కళాత్మకత ఉట్టిపడే వాతావరణం కనిపిస్తున్నది. ఆ ఆవరణలు ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, వేలంపాటలతో కళకళలాడుతున్నాయి. సగం కాఫీ షాపులా, సగం ఆర్ట్గ్యాలరీలా మారిపోతున్నాయి.
The Gallery Cafe Hyd
కాఫీ.. బుర్రకు ఇంధనం లాంటిది. సిప్పు సిప్పుకూ సృజనాత్మకత గ్రాఫ్ సప్పున పైకి లేస్తుంది. బొమ్మలేయడం అంటేనే.. క్రియేటివ్ పెయిన్. ఓ చేతిలో కుంచె, మరో చేతిలో కాఫీ కప్ ఉండాల్సిందే. కళల గురించి మాట్లాడుకోవాలన్నా, కళాకారుల గురించి చర్చించుకోవాలన్నా.. నేపథ్యంలో ‘కాఫీ’రాగం వినిపించాల్సిందే. కానీ, చాలా ఆర్ట్ గ్యాలరీలలో కాఫీ దొరకదు. దొరికినా.. రుచి అంతంతమాత్రమే. అలా అని కాఫీషాపులో కూర్చుని కళల గురించీ మాట్లాడుకోలేం. అక్కడి వాతావరణం వేరు. అక్కడికొచ్చే జంటలూ వేరు. అంటే.. కాఫీ దొరికేచోట ఆర్ట్ ఉండదు, ఆర్ట్ ఉండే చోట మంచి కాఫీ లభించదు. ఆ లోటును పూడ్చడానికే ఆర్ట్ కెఫేలు వస్తున్నాయి. ఇక్కడ ప్రముఖ కళాకారుల చిత్రాలు గోడలపై దర్శనమిస్తాయి. బుక్‌షెల్ఫ్‌లో సమకాలీన కళకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. అంతేనా, యాక్టింగ్ వర్క్‌షాపులకు, నాటక ప్రదర్శనలకు వేదిక కల్పిస్తున్నాయి.
Bangalore World Cafe
హైదరాబాద్‌లోని గ్యాలరీ కెఫేను ‘కళాకారుల స్వర్గం’ అని పిలుస్తారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ గోడల మీది పెయింటింగ్స్, ఇంటీరియర్స్ చూపు తిప్పుకోనివ్వవు. బెంగళూరు కోరమంగళలోని ‘డ్యూ ఆర్ట్ కెఫే’ సృజనలో ఓ అడుగు ముందుకేసింది. ఇక్కడంతా రాళ్ల ఫర్నిచరే. ఢిల్లీలోని పాలెట్టీ కెఫేలో మనం ఏదైనా ఆర్డర్ చేయగానే.. ఫుడ్ ఐటమ్స్‌కు ముందే చిన్నపాటి కాన్వాస్, కలర్స్ ఇస్తారు. పెయింటింగ్ వేసి కెఫే నిర్వాహకులకు ఇవ్వొచ్చు. దాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. కళాకారుల కోసమే, కళాకారులు రూపొందించిన ఓ వేదిక అహ్మదాబాద్‌లో ఉంది. దీని పేరు ‘ద ప్రాజెక్ట్ కెఫే’. ఇక్కడ నిత్యం ఏదో ఒక వర్క్‌షాప్, ఈవెంట్ జరుగుతాయి. కేరళ, కొచ్చిలోని కాశీ ఆర్ట్ కెఫే నినాదం చదివినప్పుడు ఆర్ట్ కెఫేల అసలు లక్ష్యం అర్థం అవుతుంది. ‘ఫుడ్-ఆర్ట్-మీట్’ ఆ కేఫ్ ట్యాగ్‌లైన్. తింటూ.. గీస్తూ.. సంభాషిస్తూ కళారాధన చేయవచ్చు.
Dyu Cafe
Dyu Cafe Banglore
Kashi Art Cafe Kochi
Kashi Cafe
Kashi Cafe Kochi
Palettee Cafe
Paletty Cafe Delhi
The Gallery Cafe
The Project Cafe
World Cafe
Wsi Theprojectcafe
You And I Cafe
You And I Cafe Shillong