హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమశాఖ సర్వీస్ నిబంధనలను మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేసే ప్రతిపాదనలు ఏమీ లేవని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. సంస్థ టీసీపీసీ యూనిట్లను కూడా మూసివేయడం లేదని తెలిపారు. వికలాంగుల సర్వీస్ రూల్స్‌ను, మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేస్తున్నారనే వదంతులు రావడంతో దివ్యాంగుల రాష్ట్ర సలహాబోర్డు సభ్యులు నారా నాగేశ్వర్రావు, శ్రీనివాసులు, నిరుద్యోగ వికలాంగుల సంఘం కన్వీనర్ సుధాకర్‌వర్మ సోమవారం మంత్రి కొప్పులను కలిశారు. విలీన ప్రతిపాదనలు ఏమీ లేవని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ నిర్ధారణ మేరకు సంక్షేమశాఖ సంచాలకురాలు, కమిషనర్ శైలజ ప్రకటన విడుదలచేశారు.