నార్వే : డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన నార్వే మహిళల బీచ్ హ్యాండ్ బాల్ జట్టుపై యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) జరిమానా విధించింది. హ్యాండ్ బాల్ మ్యాచ్‌లలో నిబంధనల ప్రకారం.. మహిళలు స్పోర్ట్స్ బ్రా, బికినీ వేసుకుని ఆడాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆదివారం యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే మహిళల జట్టు ప్లేయర్లు షార్ట్స్ (నిక్కర్లు) ధరించారు. దీంతో ఈహెచ్ఎఫ్.. ఒక్కొక్క ప్లేయర్‌పై 150 యూరోలు (రూ. 13,170), మొత్తంగా 1500 యూరోలు (రూ. 1,31,699) జరిమానా విధించింది.