యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) గా నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి జే భవానీ శంకర్ నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐఏఎస్‌ల బదిల్లో భాగంగా.. ప్రస్తుతం గవర్నర్ జాయింట్ సెక్రెటరీగా ఉన్న భవానీ శంకర్‌ను యాదాద్రి ఆలయ ఈవోగా బదిలీ చేశారు.
అంతకుముంద యాదాద్రి ఈవోగా ఉన్న వెంకట్రావు ఈనెల 2న తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలైన స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వెంకట్రావుపై ఒత్తిడి పెంచి రాజీనామా చేసేందుకు పురికొల్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.