Allu arjun In Tokyo |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గ్లోబల్ క్రేజ్‌ను మరింత విస్తరిస్తూ ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో సందడి చేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ జపనీస్ వెర్షన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ ప్రమోషన్స్ అనంతరం తన బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతున్నారు. టోక్యోలోని అత్యంత పురాతనమైన ‘సెన్సోజీ’ టెంపుల్‌ను బన్నీ తన కుటుంబంతో కలిసి సందర్శించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా జపాన్‌లో కూడా భారీ అంచనాల మధ్య జనవరి 16న విడుదలైంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్వయంగా అక్కడి మీడియా సంస్థలతో ముచ్చటిస్తూ, అభిమానులతో మమేకమవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు జపాన్ వీధుల్లో ఐకాన్ స్టార్‌ను చూసిన అక్కడి సినీ ప్రియులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడుతుండటం విశేషం.
ఈ టోక్యో పర్యటన ముగించుకుని భారత్ తిరిగొచ్చిన వెంటనే అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక ఫాంటసీ యాక్షన్ డ్రామాలో ఆయన నటించబోతున్నారు. దీనితో పాటు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
— Allu Arjun (@alluarjun) January 17, 2026