పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలు, నిరసనలు నిషేధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను ఇక నుంచి అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాజ్యసభ కార్యదర్శి జనరల్ పీసీ మోడీ ఈ కొత్త ఆదేశాలను ఓ బులెటిన్‌లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. రాజ్యసభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఖండించారు. విశ్వగురు కొత్త నాటకమని, ధర్నా మనా హై అంటూ జైరాం తన ట్విట్టర్లో ఆరోపించారు.
గతంలో విపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల, గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొన్ని పదాలను పార్లమెంట్లో వాడరాదని వచ్చిన వార్తలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. కానీ ఆయా పదాలను అవసరాన్ని బట్టి రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. జుమ్లాజీవి, బాల్ బుద్ది, కోవిడ్ స్ప్రెడ్డర్, స్నూప్‌గేట్, అషేమ్డ్, అబ్యూజ్డ్, బెట్రేడ్, కరప్ట్, డ్రామా, హిపోక్రసీ, ఇన్‌కాంపిటెంట్ లాంటి పదాల్ని సభలో వాడరాదని ఇటీవల లోక్‌సభ సెక్రటేరియేట్ ఓ బుక్‌లెట్‌ను రిలీజ్ చేసింది. అయితే అలాంటిది ఏమీ లేదని ఓం బిర్లా పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

