Hardeep Singh Nijjar | న్యూఢిల్లీ, జనవరి 29: కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఏ విదేశీ ప్రభుత్వ హస్తం ఉన్నట్టు ఆధారాలేవీ లభించలేదని కెనడా ప్రభుత్వం నిర్వహించిన ఓ విచారణ కమిటీ తేల్చింది.
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నట్టు కెనడా ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే ట్రూడో ఆరోపణల తర్వాత భారత్ కెనడాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని సాగించిందని విచారణ కమిటీ తన నివేదికలో ఆరోపించింది. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వార వెలుపల నిజ్జర్ హత్యకు గురయ్యాడు.