ఆర్మూర్/మాక్లూర్/నందిపేట్, మార్చి 7: ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్‌తోపాటు ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కేకులు కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం నాయకులు, కార్యకర్తల మధ్య జీవన్‌రెడ్డి కేక్ కట్‌చేశారు. జీవనన్న ట్రస్ట్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయగా, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు ఐదువేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో సేవలందించిన వైద్యులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నవనాథ సిద్ధుల గుట్టపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, కౌన్సిలర్ సంగీత దంపతులు ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ లాలన వృద్ధాశ్రమం, పాఠశాలల్లో సర్పంచ్ మచ్చర్ల పూజితాకిశోర్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానలో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.
మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీపీ మాస్త ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, జీవనన్న యువసేన అధ్యక్షుడు రంజిత్ సహా 30 మంది రక్తదానం చేశారు. అంతకు ముందు కేక్ కట్ చేశారు. మాదాపూర్ పాఠశాలలో విద్యార్థుల మధ్య బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.
నందిపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వెయ్యి మందికి అన్నదానం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పండ్లు, నోట్బుక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.