జక్రాన్‌పల్లి, జనవరి 27 : రైతులను, ప్రజలను మోసం చేసిన వారికి ఎదురుదెబ్బ తప్పదని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 203 మంది లబ్ధిదారులకు తహసీల్ కా ర్యాలయ ఆవరణలో బాజిరెడ్డి గోవర్ధన్ చెక్కులను గురువా రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, తమకు ఎదురవుతున్న సంఘటనలను చూసి ఇకనైనా జ్ఞానం తెచ్చుకోవాలన్నారు. ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పిన ఎంపీ అర్వింద్‌ను రైతులే అడ్డుకుంటున్నారని అన్నారు. రైతులు నిన్ను నిలదీస్తే వాళ్లు నీకు గుండాలుగా కనబడుతున్నారా అన్ని ప్రశ్నించారు. ‘మతి తప్పి మాట్లాడకు అర్వింద్.. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో’.. మాట తప్పిన నీకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదని విమర్శించారు. అటు రైతులకు, ఇటు జిల్లా ప్రజలకు ఏమీ చేయని నిన్ను రైతులతోపాటు ప్రజలు నిలదీస్తారని, ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబా రి మోహన్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తనూజారెడ్డి, ఎంపీపీ డీకొండ హరిత, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, వైస్ ఎంపీపీ కుంచాల విమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీటీసీలు గంగారెడ్డి, సతీశ్, ఉపసర్పంచ్ బాలకిషన్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, కుంచాల రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.