e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News పోలీసు అమరు ల త్యాగాలు మరువలేనివి..

పోలీసు అమరు ల త్యాగాలు మరువలేనివి..

  • వారి కుటుంబాలకు అండగా ఉంటాం
  • అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా
  • అమరులకు ఘనంగా నివాళులు
  • పోలీసు అమరులకు ఘన నివాళి
  • సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు

ఇందూరు, అక్టోబర్‌ 21 : పోలీసు అమరు ల త్యాగాలు మరువలేనివని, వారికి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, డీసీపీ ఉషా విశ్వనాథ్‌, ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ పోలీసు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులు తమ ప్రా ణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నందునే మనం సంతోషంగా జీవించగలుగుతున్నామన్నారు. అమరుల త్యాగాలు వెల కట్టలేనివని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.దేశానికి జవాన్‌, కిసాన్‌ రెండు కండ్ల వంటి వారన్నారు. అనంతరం సీపీ కార్తికేయ మాట్లాడుతూ పోలీసులు 24/7 ప్రజల సేవలో ఉంటారన్నారు. ప్రజల యోగక్షేమాల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఒకే ఒక్క గొప్ప వ్యక్తి పోలీసు అన్నారు. అమరుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సంస్మరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1959, అక్టోబర్‌ 21న పది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు జమ్మూకశ్మీర్‌లోని ‘లదాఖ్‌’లో హాట్‌ స్ప్రింగ్‌ నుంచి చైనా చొరబాట్లను అరికట్టడానికి సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 10 మంది జవాన్లు, 14 గంటల పాటు దేశ రక్షణ కోసం రాజీ లేని పోరాటం చేసి అమరులయ్యారన్నారు. అమూల్యమైన వారి తాగ్యా న్ని మననం చేయడం కోసమే సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిషలు కృషి చేస్తూ, ఉగ్రవాద, తీవ్రవాద చర్యల్ని ఎదుర్కొంటూ సంఘ విద్రోహ శక్తుల నుంచి పౌరుల ధన, మాన, ప్రాణ, రక్షణ కోసం పోరాటం చేస్తూ ప్రతి సంవత్సరం ఎంతో మంది పోలీసులు అమరులవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సర కాలంలో అసాంఘిక శక్తుల చర్యలతో మొత్తం 377 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 1987 నుంచి నేటి వరకు 24 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విధులను నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అరవింద్‌బాబు, అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఉషావిశ్వనాథ్‌ తిరునగిరి, అదనపు డీసీపీ (ఏఆర్‌) పి.గిరిరాజ్‌, కామారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్‌) అనోన్య, నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీలు వెంకటేశ్వర్లు, ఆర్‌.ప్రభాకర్‌రావు, కామారెడ్డి ఏఆర్‌ డీఎస్పీ హృదయకృష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ప్రసాద్‌, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి విధులు

- Advertisement -

కమాండెంట్‌ ఎన్‌వి.సత్యశ్రీనివాస్‌రావు
డిచ్‌పల్లి, అక్టోబర్‌ 21 : పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తారని ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ సత్యశ్రీనివాస్‌రావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బెటాలియన్‌ ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ – ప్రజా రక్షణ కోసం గడియారంలోని ముల్లులా రేయింబ వళ్లు శ్రమిస్తూ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థంగా విధులు నిర్వహిస్తూ జీవితాన్ని అంకితం చేస్తున్నారన్నారు. వారి సాహసోపేతమైన చర్యల్ని మాటల్లో వర్ణించలేమని, వెల కట్టలేమని, వారి సేవలు అమోఘమన్నారు. గతంలో అమరులైన 11 మంది ఏడో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఆత్మలకు శాంతి కలుగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, కుటుంబ సభ్యులను ఎల్లవేళలా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ సుబ్రమ్మణ్యం, అసిస్టెంట్‌ కమాండెంట్లు ఎం.వెంకటేశ్వర్లు, కె.భాస్కర్‌రావు, సి.ఆంజనేయరెడ్డి, ఆర్‌ఐలు పి.వెంకటేశ్వర్లు, ఎం.నరేశ్‌, వి.బాబురావు, కె.శ్యామ్‌రావు, ఆర్‌.ప్రహ్లాద్‌, సి.సురేశ్‌, బి.వసంత్‌రావు, ఆర్‌ఎస్సైలు పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement