భీమ్గల్, నవంబర్ 17: లింబాద్రిగుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగా బుధవారం వైకుంఠ చతుర్థిని పురస్కరించుకొని శ్రీ నృసింహపూజ, ధాత్రీ హవనం కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం కొండపైన ఉన్న సీతానగరంపై డోలోత్సవం, దీపోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
నేడు జాతర ..
లింబాద్రి గుట్టపై గురువారం జాతర నిర్వహించనున్న ట్లు ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతరకు అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. జాతరలో భాగంగా రథోత్సవం, రథభ్రమణం నిర్వహిస్తామని తెలిపారు.