చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో రాణా హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టారు. 6 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. గిల్(14), రాణా(36) బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగులు సాధిస్తున్నారు.
The @KKRiders get off to a flying start with a solid 50-run partnership between their openers.
— IndianPremierLeague (@IPL) April 11, 2021
At the end of the powerplay, the scoreboard reads 50/0
Live – https://t.co/pSh1Qt33LQ #SRHvKKR #VIVOIPL pic.twitter.com/8hiRb3hM2S