నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నికితారెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి పుస్కూర్ రామ్మోహన్ రావు క్లాప్‌నివ్వగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. అది పూర్తయిన తర్వాతే తాజా చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ‘అన్ని కమర్షియల్ హంగులు కలబోసిన చిత్రమిది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథనందించిన వక్కంతం వంశీ..ఈ సినిమాలో నితిన్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: హారిస్ జయరాజ్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్, రచన-దర్శకత్వం: వక్కంతం వంశీ.