ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ (Pawankalyan), నితిన్ (Nithiin) మధ్య ఎలాంటి బంధం ఉందో అందరికీ తెలుసు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న రోజే నితిన్ కూడా తన సినిమా విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి అనే దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్నికల అధికారిగా నటిస్తున్నాడు నితిన్. ఒక ఊర్లో జరిగే రాజకీయ గొడవల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతోంది. భీష్మ తర్వాత సరైన విజయం లేక నితిన్ కెరీర్ మళ్లీ గాడి తప్పింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన చెక్, రంగ్ దే నిరాశపరిచాయి. మొన్న ఓటీటీ వేదికగా విడుదలైన మాస్ట్రో సినిమా కూడా పెద్దగా అంచనాలు అందుకోలేదు. దాంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు నితిన్. ఈ క్రమంలోనే అతడి నుంచి వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నితిన్. ఏప్రిల్ 29, 2022న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా కూడా విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం చాలా రోజుల కింద వచ్చింది. సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం 100 కోట్ల బడ్జెట్‌తో హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు.
మరి పవన్ వస్తున్న రోజే నితిన్ ఎలా వస్తున్నాడని అందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అయితే ఈ విషయంలో నితిన్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. 29న పవన్ కళ్యాణ్ సినిమా రావడం లేదు అని ఆయనకు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడినట్లు పక్కా సమాచారం అందుకున్న తర్వాత.. అదే రోజు తన సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం సినిమాకు నిర్మాత కూడా ఆయనే. మొత్తానికి పవన్ రావట్లేదని తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి