ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ)లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: బీఏ (ఆనర్స్)
మొత్తం సీట్ల సంఖ్య: 200
ఈ కోర్సుకు లండన్‌లోని కింగ్స్టన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ సహకారం అందిస్తుంది.
స్పెషలైజేషన్లు: ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ డిజైన్. ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ వ్యవధి మూడేండ్లు. మిగిలిన స్పెషలైజేషన్ల డిగ్రీ వ్యవధి నాలుగేండ్లు.
మొదటి ఏడాది ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. తరవాతి మూడేండ్లు అభ్యర్థి ఎంచుకొన్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన కోర్సులు ఉంటాయి.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సైన్స్/కామర్స్/ హ్యుమానిటీస్/ ఆర్ట్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్ విభాగాల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు. వీరిని పర్సనల్ ఇంటర్వ్యూ, పోర్ట్‌ఫోలియో అసెస్మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కాల్యవ్యవధి రెండేండ్లు.
నోట్: మొదటి ఏడాది పూర్తయ్యాక ప్రోగ్రామ్ నుంచి వైదొలగే అవకాశం కల్పించారు. వీరికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు.
సీట్ల సంఖ్య: 40
స్పెషలైజేషన్లు: ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు: ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రవేశానికి మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐమ్యాట్) నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, రైటింగ్ టాస్క్‌లు ఇస్తారు. లాజికల్ రీజనింగ్, క్రియేటివ్ థింకింగ్ అంశాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని గుర్తించేలా ప్రశ్నలు ఇస్తారు. ఈ టెస్ట్‌లో అర్హత పొందినవారిని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఫ్యాషన్, కమ్యూనికేషన్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్ విభాగాల్లో ప్రవేశానికి డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో విజువల్ టాస్క్‌లు, రైటింగ్ టాస్క్‌లు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. క్రియేటివిటీ, విజువల్ ఎబిలిటీ, కల్చరల్ అవేర్నెస్, లాజికల్ థింకింగ్ అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.
నోట్: మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వ్యవధి రెండున్నర గంటలు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 2
ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు: ఏప్రిల్ 9, 10
వెబ్సైట్: www.iiad.edu.in