Nikhil siddharth | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్. సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిఖిల్ రొటీన్ భిన్నంగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను నిరూపించుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధంలేకుండా ప్రయోగాలను చేస్తుంటాడు. నిఖిల్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ’18పేజిస్’. గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌ను ఏప్రిల్6 సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కుమారి 21ఎఫ్’ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. నిఖిల్‌కు జోడిగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. అల్లుఅరవింద్ సమర్పణలో బన్నివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిఖిల్ గత చిత్రం ‘అర్జున్ సురవరం’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
Mana #18pages Video Glimpse Coming on April 6th @ 6:03 PM! This time no Missing Just Rocking 🤗#AlluAravind @aryasukku @actor_Nikhil @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @lightsmith83 @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/tfWZEOzx9D
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 4, 2022