మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ

ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని.. ప్రజలకు ముందుస్తుగా సమాచారం ఇస్తామని చెప్పారు. ‘నేను లాక్డౌన్ విధించడానికి ఇష్టపడను.. కానీ కరోనా బాధితులు పెరుగుతుండడంతో ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించకుంటే కఠినమైన లాక్డౌన్ తప్పదని హెచ్చరించారు.
నిన్న 36వేల పాజిటివ్ కేసులు
హాస్పిటళ్లలో తగిన పడకలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో శుక్రవారం 36,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 112 మంది ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదు రోజుల్లో 1.3 లక్షలకుపైగా కేసులు రికార్డయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం బీడ్, నాందేడ్ జిల్లాల్లో పది రోజుల లాక్డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌కు బదులుగా స్థానిక పరిస్థితుల మేరకు లాక్డౌన్ విధింపునకు జిల్లా అధికారులకు లాక్డౌన్ విధించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

