నలుగురికి ఉరి
పాట్నా: 2013 నాటి పాట్నా వరుస పేలుళ్ల కేసులో 9 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేండ్ల కారాగార శిక్ష, మరొకరికి ఏడేండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సభ ఏర్పాటుచేశారు. ఆ సభ రోజు పాట్నాలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే అప్పటికి మోదీ సభాస్థలికి చేరుకోలేదు. బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు.