మహిళల వన్డే ప్రపంచకప్
డునెడిన్ (న్యూజిలాండ్): సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. భారీ వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఫర్జానా (52) టాప్‌స్కోరర్‌గా నిలిచింది. కివీస్ బౌలర్లలో సాథర్‌వైట్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూజీ బేట్స్ (79 నాటౌట్; 8 ఫోర్లు), అమెలియా కెర్ (47) రాణించారు.