ప్రతి నెలా.. విహారం భళా!
కొత్త క్యాలెండర్ గోడెక్కగానే ముందుగా కండ్లు వెదికేది ఎర్ర ఇంకు తేదీలనే! ఏదైనా పండుగ ఐతారం తారసపడితే ఉసూరుమంటారు. శనివారానికి ముందో, ఆదివారం తర్వాతో పండుగ పడిందా ఎవరెస్ట్ ఎక్కేసినంత సంబురపడిపోతారు.
కొత్త క్యాలెండర్ గోడెక్కగానే ముందుగా కండ్లు వెదికేది ఎర్ర ఇంకు తేదీలనే! ఏదైనా పండుగ ఐతారం తారసపడితే ఉసూరుమంటారు. శనివారానికి ముందో, ఆదివారం తర్వాతో పండుగ పడిందా ఎవరెస్ట్ ఎక్కేసినంత సంబురపడిపోతారు. ఆ సెలవుల్లో ఏయే ప్రాంతాలు చుట్టేయాలో ఒక అంచనాకు వచ్చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి, దీపావళి పండుగలు ఆదివారం వచ్చాయని అప్పుడే ఇదైపోకండి. పర్యాటక ప్రియులను ప్రయాణానికి పురిగొల్పే లాంగ్వీకెండ్లు చాలానే ఉన్నాయి. ఒకటీ అరా సెలవులు సర్దుబాటు చేసుకోగలిగితే నాలుగు రోజుల విహారానికి సై అనొచ్చు.
జనవరి 26 గురువారం అయింది.శుక్రవారం సెలవు పెట్టుకోగలిగితే శని, ఆదివారాలు అదనంగా కలిసొస్తాయి. నాలుగు రోజుల పర్యటన కొత్త ఏడాదికి కొంగొత్త ఉత్సాహం ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
ఫిబ్రవరి 17 శుక్రవారం మహాశివరాత్రి. శని, ఆదివారాలు జతచేస్తే.. మూడు రోజుల్లో ముచ్చటైన చోటును చుట్టిరావొచ్చు.
ఏప్రిల్ 7 గుడ్‌ఫ్రైడేకు తోడుగా శని, ఆది వారాలు ఉండనే ఉంటాయి. ఓ మోస్తరు పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
జూన్ 29 గురువారం బక్రీద్ పండుగ. ఒకరోజు సెలవు పెట్టుకోగలిగితే.. మరో రెండు రోజులు కలిసివస్తాయి. రుతుపవనాల వేళ మలబారు తీరానికి విహారం వెళ్లొచ్చు.
ఆగస్టు 12 రెండో శనివారం, 13 ఆదివారం. 14 సోమవారం సెలవు తీసుకుంటే.. మంగళవారం పంద్రాగస్టు కలిసొస్తుంది. నాలుగు రోజుల విహారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 7వ తేదీ జన్మాష్టమి గురువారం. శుక్రవారం సెలవు తీసుకోగలిగితే రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తాయి. మొత్తంగా ఈ నెలలో 7 నుంచి 10 వరకు నాలుగు రోజులు యాత్రకు వెళ్లొచ్చు.
అక్టోబర్‌లో దసరా సెలవులు ఎలాగూ కలిసివస్తాయి. అక్టోబర్ 21 శనివారం నుంచి 24 (దసరా) మంగళవారం వరకు నాలుగు రోజులను విహారానికి కేటాయించుకోవచ్చు.
నవంబర్ 27 గురునానక్ జయంతి సోమవారం. శని, ఆదివారాలతో మొత్తంగా మూడురోజుల ట్రిప్ వేసుకోవచ్చు.
డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారమైంది. ముందు రెండురోజులు, 26వ తేదీ బాక్సింగ్ డే సెలవును కలుపుకొంటే… ఘనమైన విహారంతో 2023కు వీడ్కోలు పలకొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

