బెంగళూరు, జనవరి 4: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్..మరో రెండు మాడళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 2025 ఏథర్ 450 పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్లు రెండు రకాల్లో లభించనున్నాయి. వీటిలో ఏథర్ 450 ఎస్ మాడల్ ధర రూ.1,29,999 కాగా, 2.9 కిలోవాట్లా బ్యాటరీ కలిగిన 450 ఎక్స్ మాడల్ రూ.1,46,999, 3.7 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన 450 ఎక్స్ మాడల్ విలువ రూ.1,56, 999,450 అపెక్స్ మాడల్ ధర రూ.1,99,999 గా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. సింగిల్ చార్జింగ్‌తో 105 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో ఈ స్కూటర్ల కోసం బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. ఈ స్కూటర్లపై ఎనిమిదేండ్లు లేదా 80 కిలోమీటర్ల వరకు వ్యారెంటీ కల్పిస్తున్నది.