హైదరాబాద్, మే 11: దేశంలో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటైన హెటిరో..తన బ్రాండ్‌కు మరింత ప్రచారం కల్పించడానికి సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ..అందరికి ఆరోగ్యం అనే నినాదంతో నూతన లోగోను డిజైన్ చేసినట్లు, ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణలకు కూడా ఇది చిహ్నాంగా ఉంటుందన్నారు. గత 30 ఏండ్లుగా పాత లోగోతో వ్యాపారం నిర్వహిస్తున్నది. పరిశోధన, తయారీ, మార్కెటింగ్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన హెటిరో గ్రూపు కొత్త పుంతలు తొక్కుతున్నదని కంపెనీ అన్నారు.