నేడు చేయూత కొత్త పింఛన్ల పంపిణీ
చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేదీని ప్రకటించింది.
- 4.5 లక్షల మందికి ప్రయోజనం
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేదీని ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు అందించనున్నట్టు ప్రకటించింది. సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆదివారం నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక తెలిపారు.
అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల చేతులమీదుగా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, కల్లుగీత తదితర వర్గాల్లోని అర్హులైన వారికి కొత్తగా ఈ పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. కొత్తగా పింఛన్ లబ్ధిదారులందరికీ ఈ నెల నుంచే పింఛన్ నగదును అందిస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

