ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనతోపాటు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనతోపాటు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి లేదా మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పదవీకాలం మార్చిలో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ తొలి విడత గడువు శుక్రవారంతో ముగిసే సమయానికి మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 5,77,182 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,12,954 దరఖాస్తులను ఆమోదించగా, 4,41,006 పెండింగ్లోఉండగా 2,780 తిరసరించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 6,52,680 దరఖాస్తులు అందా యి.
వీటిలో 2,30,906 ఆమోదం పొంద గా, 3,93,169 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 11,746 దరఖాస్తులను తిరసరించారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి ఇప్పటికే 12.29 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. డిసెంబర్ 10 నుంచి రెండో విడత నమోదు ప్రారంభం కానుండటంతో మరో రెండు లక్షల వరకు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తుది ఓటర్ల జాబితా రూపొందించే వరకు నమోదు, పరిశీలనకు సమయం ఉంటుందని చెప్పారు.
ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు
2026 నవంబర్ 1 అర్హత తేదీగా తీసుకుని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలనుకునేవారు https:// ceotelangana.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలతో ఫామ్ -18ను సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్వోలు), నియమిత అధికారులు లేదా అదనపు నియమిత అధికారులకు నేరుగా సమర్పించవచ్చు. పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపేందుకు అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

