పూణె, జూన్ 17: బజాజ్ ఆటో లిమిటెడ్..దేశీయ మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చేతక్ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన చేతక్ 3001 అప్‌గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 127 కిలోమీటరు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.99,990గా నిర్ణయించింది. గతంలో ప్రవేశపెట్టిన 2903 మాడల్‌ను అప్‌గ్రేడ్ చేసి ఈ నయా వెర్షన్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాల వెల్లడించాయి. 3.0 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ కేవలం 3.50 గంటల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్నది. ఈ విభాగంలో అత్యంత వేగవంతంగా అయ్యే స్కూటర్ ఇదే కావడం విశేషం. ఈ స్కూటర్లో కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ గేర్, ఆటో-ఫ్లాషింగ్ స్టాప్ ల్యాంప్, వాటర్ రెసిస్టెన్స్ వంటి టెక్నాలజీతో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ వ్యాస్ మాట్లాడుతూ..చేతక్ 3001తో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ రూపురేఖలు మారిపోనున్నదని, నెక్స్ జనరేషన్‌కు ఇది బాట వేయనున్నదన్నారు.