
హైదరాబాద్, అక్టోబర్ 27: కృత్రిమ మేధస్సు (ఏఐ), డాటా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ అఫైన్..హైదరాబాద్‌లో కొత్తగా ఒక శాఖను ఏర్పాటుచేసింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ… హైదరాబాద్ శాఖలో ప్రస్తుత ఏడాది 200 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ సంఖ్యను వచ్చే సంవత్సరాంతానికి 400కు పెంచనున్నట్లు అఫైన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. టెక్నాలజీ కంపెనీలన్నింటికీ హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా అవతరించిందని, ఇక్కడ వృద్ధికి ఎంతో అవకాశం ఉన్నదని అఫైన్ సీఈవో మానస్ అగర్వాల్ పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, మాన్యుఫాక్చరింగ్ వర్టికల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు తమ ఇంజనీర్లు కొన్ని వినూత్న ప్రొడక్టుల్ని, సొల్యూషన్లను రూపొందించారన్నారు.