సిడ్నీ: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఎదురీదుతోంది. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 15 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 81 రన్స్ చేసింది. నెదర్లాండ్స్ జట్టు పవర్‌ప్లేలో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. ఆరు ఓవర్లలో నెదర్లాండ్స్ రెండు వికెట్లు కోల్పోయి 27 రన్స్ చేసింది. కడపటివార్తలు అందేసరికి నెదర్లాండ్స్ 16 ఓవర్లలో ఆరు వికెట్లకు 87 రన్స్ చేసింది. ప్రింగిల్ 20 రన్స్ చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం వాన్ బీక్, ఎడ్వర్డ్స్ క్రీజ్‌లో ఉన్నారు.