Nenu Meeku Baga Kavalsinavaadini On OTT | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫలితం ఎలా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇటీవల కిరణ్ నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం అసలు రిలీజైనట్టు కూడా సగం మందికి తెలియదు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీధర్ గాధే తెరకెక్కించాడు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా డిజటిల్ హక్కులను ‘ఆహా’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా థియేటర్ విడుదలకు కేవలం నాలుగ వారాల్లోపే ఈ చిత్రం ఓటీటీలకి వచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మించింది. కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు పోటీగా అదే రోజున సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శాకిని డాకిని’ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ మూడు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గానే మిగిలాయి.