ముంబై: షారూక్ తనయుడు ఆర్యన్ అరెస్టు కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సమీర్ వాంఖడే సహా పలువురు అధికారులపై ఎన్సీబీ దర్యాప్తునకు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ను అదుపులోకి తీసుకొన్న తర్వాత సమీర్ వాంఖడే నేతృత్వంలో అధికారులు షారూక్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సయిల్ ఆరోపించడంతో ఎన్సీబీ ఈ నిర్ణయం తీసుకొన్నది.