హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమిస్తామని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని తెలిపారు. విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏవోఏటీ) వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్లో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన నవీన్‌మిట్టల్ మాట్లాడుతూ.. జెన్కో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బదిలీలు చేపడతామని తెలిపారు.
వీఏవోఏటీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా నాజర్ షరీఫ్, ప్రధాన కార్యదర్శిగా పాపకంటి అంజయ్య ఎన్నికయ్యారు. స్టేట్ జనరల్ సెక్రటరీగా పీ అంజయ్య, స్టేట్ ప్రెసిడెంట్‌గా మన్సార్ షరీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీహరిస్వామి, ఉపాధ్యక్షులుగా సీహెచ్ శ్యామల్రావు, వీ పరమేశ్, జాయింట్ సెక్రటరీలుగా నర్సింహ రాములు, దేవీదాస్ తదితరులు ఎన్నికయ్యారు.