‘చాలా కాలం గుర్తుండిపోయే మంచి సినిమా ఇది. అవికాతో నా కాంబినేషన్లో వచ్చిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు నవీన్‌చంద్ర. అవికాగోర్‌తో కలిసి ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్రో’ కార్తిక్ తుపురాని దర్శకుడు. జేజేఆర్ రవిచంద్ నిర్మించారు. ఇటీవల సోనిలివ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మరాఠీలో రూపొందిన ‘హ్యాపీ బ్రదర్’కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాం. నవీన్‌చంద్ర, అవికాగోర్ తమ నటనతో సినిమాకు ప్రాణంపోశారు’ అని తెలిపారు. ‘చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది. నా కెరీర్లో మంచి సినిమాల్లో ఒకటిగా నిలవడం ఆనందంగా ఉంది. నా పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు’ అని అవికాగోర్ చెప్పింది. అన్నాచెలెళ్ల అనుబంధాన్ని కొత్త పంథాలో చూపించిన సినిమా ఇదని నటుడు దేవిప్రసాద్ పేర్కొన్నారు.