రష్యా తీరుపై నాటో అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికీ రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో అలాగే ఉన్నాయని, పైగా సంఖ్య కూడా పెరిగిందని నాటో అధ్యక్షుడు జేమ్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. బలగాలు వెనక్కి తగ్గాయనడానికి కావాల్సిన ఆధారాలు తమకు చూపాలని ఆయన సవాల్ విసిరారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించామని రష్యా ప్రకటించింది. కొన్ని దళాలను బేస్ క్యాంప్‌కు పంపినట్లు రష్యా పేర్కొంది. అయితే నాటో అధ్యక్షుడు మాత్రం బలగాలు అక్కడే ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా స్పందించారు.
రష్యా మాటలను తాము ఎంత మాత్రం నమ్మలేకపోతున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించే స్థితిలోనే రష్యా బలగాలు కాపుకాశాయని, ఇప్పటికీ దాడి చేసే అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నారు. అయినా… దౌత్యం ద్వారా దాడులను ఆపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని జోబైడెన్ ప్రకటించారు. తాము ఇప్పటికీ నాటో దేశాలకు బలంగా మద్దతిస్తామని, ఒక నాటో దేశంపై దాడికి దిగితే.. అన్ని దేశాలపై దాడి చేసినట్లే తాము భావిస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు.