హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుభవార్త చెప్పింది. దరఖాస్తు చేసుకొనేందుకు మరో చాన్స్ ఇచ్చినట్టు పేర్కొన్నది. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ విండోను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది.
గురువారం నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో మార్పు చేసుకొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరుగనున్నాయి.