తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నేషనల్ హెల్త్ అథారిటీ

న్యూఢిల్లీ, మే 24: తెలంగాణా రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం–జేఎవై) పథకం అమలు చేయడానికి అవగాహన ఒప్పందాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలో యాడ్ చేయడంతో పాటుగా ఈ పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పీఎం–జే ఆరోగ్యశ్రీగా పిలుస్తారు.
ఆయుష్మాన్ భారత్ పీఎం–జె పథకాన్ని తెలంగాణాలో అమలులోకి తీసుకురావడం ద్వారా ఇది దేశంలో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించినట్లయింది. ఈ పథకం ద్వారా ఎస్ఈసీసీ డాటా 2011 ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల కుటుంబాలు (దాదాపు 1.3కోట్ల మంది వ్యక్తులు) లబ్ధి పొందుతాయి. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య భీమా కవరేజీని పొందుతుంది. ఈ ఆరోగ్య సేవలు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్నటువంటి 22వేల ఆస్పత్రులలో లభ్యమవుతాయి. ఎన్హెచ్ఏతో పాటుగా రాష్ట్ర ఆరోగ్య ఏజెన్సీలు అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం వర్తించేలా తగు చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ సమ్మిళిత పథకం ద్వారా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.
నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్ ఎస్ శర్మ మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో ఏబీ–పీఎం జే పథక అమలు కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలుపడం పట్ల సంతోషంగా ఉన్నాము. రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 వేల నెట్వర్క్ ఆస్పత్రులలో సేవలు పొందేందుకు అర్హులు. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలతో పాటుగాతెలంగాణారాష్ట్రంలోఇతరరాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు చెంది నివాసముంటున్న వారికి సైతం ఇది ప్రయోజనం కలిగించనుంది. ప్రదాతల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మా కాల్ సెంటర్‌కు ఇప్పటికే రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ పథక ప్రయోజనాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

