హైదరాబాద్, సెప్టెంబర్ 4: అమెరికాకు చెందిన బయోఫార్మా ఈ-జెన్సిస్కు చెందిన 40 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసింది నాట్కో ఫార్మా. ఇందుకోసం సంస్థ 8 మిలియన్ డాలర్లు(రూ.70 కోట్లకు పైగా) నిధులు వెచ్చించింది. కిడ్ని ట్రాన్స్‌ప్లాంట్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ వైఫల్యాలకు సంబంధించి ఔషధాల తయారీలో ఈ-జెన్సిస్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నది.
సెబీ చీఫ్‌పై ఉద్యోగుల ఫిర్యాదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. సెబీ చీఫ్‌పై ఏకంగా ఉద్యోగులు ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద మొరపెట్టుకున్నారు. సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానించడం, అనవాయితీగా మారిపోయిందని ఆగస్టు 6న రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్రూపు సభ్యులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి నిమిషం టీం సభ్యుల కదలికలను పర్యవేక్షిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మానసికంగా కుంగి పోతున్నామని, వర్క్-లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నామని వెల్లడించారు. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు.