NASA+ OTT | కరోనా వల్ల లాభపడింది ఏదన్నా ఉందంటే అది ఓటీటీనే (Over The Top). లాక్డౌన్ సమయంలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించి తన స్థానాన్ని టాప్ ప్లేస్‌లో నిలుపుకుంది. కరోన అనంతరం థియేటర్లు తెరుచుకొని సినిమాలు విడుదలవుతున్నా.. ఓటీటీ తన హవాను కొనసాగిస్తు వస్తుంది. ఇక దేశంలోని ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్ (Amazon prime), నెట్‌ఫ్లిక్స్ (Netflix), ఆహా (AHA), జీ5, డీస్నీ + హాట్‌స్టార్ (Disney +Hotstar), సోని లీవ్(Sony LIV) తదితర ప్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు కొత్త కంటెంట్‌ను అందిస్తూ, రోజురోజుకు సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకొంటున్నాయి. అయితే తాజాగా ఈ మార్కెట్ లోకి మరో కొత్త ఓటీటీ రాబోతుంది. ఈ ఓటీటీ ప్రారంభించేది ఎవరో కాదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా).
నాసా (NASA) తన స్వంత ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నాసా ప్లస్ (NASA+), పేరిట 2024లో మార్కెట్ లోకి ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ రానుంది. ఇందులో లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు, నాసా టాక్స్, నాసా కిడ్స్, నాసా ఎక్స్‌ప్లోరర్స్, నాసా స్పేస్ ప్రోగ్రామ్స్, సైన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, ఎమ్మి అవార్డు-విన్నింగ్ లైవ్ కవరేజి ఇలా అన్ని రకాల కంటెంట్‌తో త్వరలో ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించనుందని తెలిపింది. ఇక ఈ ఓటీటీ యాపిల్, గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఇతర వెబ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇక దీనిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్పందిస్తూ.. ఇండియన్ వెబ్ సిరీస్ సాక్రేడ్ గేమ్స్‌లోని ఫేమస్ డైలాగ్ చందమామ మీద ఉన్న నేను అంటూ రాసుకోచ్చింది.
Excited to see what Gaitonde has been up to 😍 https://t.co/slZY5KKQqY pic.twitter.com/QwnIK3P7kx
— Netflix India (@NetflixIndia) August 3, 2023