
ముషీరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎం.నర్సయ్య రెండవసారి ఎన్నికయ్యా రు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో రాష్ట్రస్థాయి విస్తృ తస్థాయి ప్రతినిధుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నారగోని ప్రవీణ్ నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు. నర్సయ్య రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. నర్సయ్య మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. లేఔట్లు, ధరణి వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు.