అమరావతి : నరసాపురం – ధర్మవరం రైలు సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. రైలులో గంటల తరబడిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, సమాచారం అందుకున్న అధికారులు రైలును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఇంజిన్ సహాయంతో తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రైలు ఆగిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.