Godavari Pushkaralu | పుష్కర ఘాట్‌కు సీఎం చంద్రబాబు మనవడి పేరు.!
Nara Devaansh | తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం మునికూడలి పుష్కర ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడైన నారా దేవాన్ష్ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Nara Lokesh | తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం మునికూడలి పుష్కర ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడైన నారా దేవాన్ష్ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో ఈ ఘాట్‌ను ఆదర్శ ఘాట్‌గా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయని, దీనికి దేవాన్ష్ ఘాట్ అని నామకరణం చేస్తున్నట్లు స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇటీవల వెల్లడించారు. అయితే స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో, అభిమానంతో ఈ పేరును ప్రతిపాదించినప్పటికీ, ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
దీంతో ఈ విషయం కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఘాట్లకు లేదా ప్రజా ఆస్తులకు తన కుమారుడు దేవాన్ష్ పేరు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటి పనులను తాను అస్సలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. దేవాన్ష్ పేరు మీద ఎలాంటి ఘాట్లకు నామకరణం చేయకూడదని ఇప్పటికే అధికారులకు, స్థానిక నాయకులకు కరాఖండిగా ఆదేశాలు జారీ చేశానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా ఆస్తుల విషయంలో ఇలాంటి కొత్త సంస్కృతికి తావులేదని నారా లోకేష్ ఈ వివాదానికి ముగింపు పలికారు.
This is ridiculous. I’ve issued directions that no ghats should be named after Devaansh. Thank you for your kind attention to this matter! 🙏 https://t.co/dhVxsEmoWB
— Lokesh Nara (@naralokesh) June 6, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

