Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
‘ది ప్యారడైజ్' కోసం ఏడాదిపాటు కష్టపడ్డారు అగ్ర కథానాయకుడు నాని. ఆ సినిమా తర్వాత ఆయన కాస్తంత గ్యాప్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం విభిన్నమైన లుక్‌తో, రెట్టింపు ఎనర్జీతో వెంటనే ‘బ్లడీ రోమియో’ షూట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ కోసం ఏడాదిపాటు కష్టపడ్డారు అగ్ర కథానాయకుడు నాని. ఆ సినిమా తర్వాత ఆయన కాస్తంత గ్యాప్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం విభిన్నమైన లుక్‌తో, రెట్టింపు ఎనర్జీతో వెంటనే ‘బ్లడీ రోమియో’ షూట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవలే ఢిల్లీలో మొదలైంది. ఇంతలోనే తొలి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకున్నది. ఈ లెక్కన మేకర్స్ ఎంత వేగంగా ఈ సినిమాకు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు, రెండో షెడ్యూల్‌కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటుందని తెలిసింది. లండన్ నేపథ్యంలో ఫుడ్ మాఫియా చుట్టూ సాగే ైస్టెలిష్ డార్క్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని తెలిసింది. ఇందులో నైపుణ్యం కలిగిన చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపిస్తారట. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వినికిడి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈచిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Nominated Posts | ‘నామినేటెడ్’ ఊరించుడే..! దీపావళి ఆశలపై నీళ్లు చల్లిన అధిష్ఠానం
Social Media | సామాజిక మాధ్యమాలకు చట్ట ‘రక్షణ’ తొలగింపు? భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని నిపుణుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

