అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’
అరెస్టు చేసిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఉన్న 24 గంటల రాజ్యాంగ గడువుపై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. పోలీసులు అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
- అరెస్టు, నిర్బంధం మధ్య కృత్రిమ వ్యత్యాసం ఉండరాదు
- గడువులోగా నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిందే
- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అరెస్టు చేసిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఉన్న 24 గంటల రాజ్యాంగ గడువుపై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. పోలీసులు అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 22(2) అధికరణ ప్రయోజనం కోసం ‘అరెస్టు’, ‘నిర్బంధం’ మధ్య ఎలాంటి కృత్రిమ వ్యత్యాసం ఉండరాదని పేర్కొంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అరెస్టుకు ముందు నిర్బంధ కాలాన్ని మినహాయించడానికి పోలీసులను అనుమతించే ఏ వ్యాఖ్యానమైనా రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా ఉంటుందని తెలిపింది. 24 గంటల గడువు కేవలం అధికారిక అరెస్టు జరిగినప్పటి నుంచే ప్రారంభమవుతుందనే అభిప్రాయం 22(2) అధికరణ, బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 56 రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధం అని ధర్మాసనం పేర్కొంది. ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ నిబంధనల కింద నమోదైన కేసులో త్రిపుర హైకోర్టు తమ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు నిందితులు దాఖలు చేసిన అప్పీలుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
న్యాయపరమైన పర్యవేక్షణ లేకుండా 18 గంటల పాటు కస్టడీలో ఉంచడం సుదీర్ఘ సమయం. ఇందులో అధికారాన్ని దుర్వినియోగం చేసే లేదా అతిక్రమించే అవకాశం స్పష్టంగా ఉంది అని కోర్టు పేర్కొంది. అరెస్టు చేసే ప్రదేశం నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకు ప్రయాణించడానికి సహేతుకంగా అవసరమైన సమయాన్ని మాత్రమే 24 గంటల గడువును లెక్కించేటప్పుడు మినహాయించవచ్చని తీర్పు పేర్కొంది. అధికారిక అరెస్టుకు ముందు విచారణ, సోదాలు లేదా స్వాధీనం చేసుకోవడం కోసం వెచ్చించిన సమయాన్ని మినహాయించలేమని కోర్టు స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

