HIT 3 Collections | స్టార్ నటుడు నాని నటించిన తాజా చిత్రం ‘హిట్- 3’ (హిట్ : ది థర్డ్ కేస్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం మే 1న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది.
తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం నాని కెరీర్లోనే డే1 అత్యధిక కలెక్షన్లను సాధించగా.. ఈ జోరును కొనసాగిస్తూ, రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. శుక్రవారం డీసెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం రెండో రోజే సునాయాసంగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటేసింది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా రూ. 19 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండు రోజుల్లోనే ‘హిట్ 3’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. “బాక్సాఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది” అంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మరోవైపు టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కూడా ఈ సినిమాకు విశేషమైన స్పందన లభిస్తోంది. మొదటి రోజు 2.70 లక్షల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు 2.06 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని బుక్ మై షో తెలిపింది. ఈ వీకెండ్లో టికెట్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు రోజులు వీకెండ్ రావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సాను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
It is SARKAAR’S HUNT at the box office 💥💥#HIT3 grosses 62+ CRORES WORLDWIDE in 2 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar#AbkiBaarArjunSarkaar pic.twitter.com/YVf89blt27— Wall Poster Cinema (@walpostercinema) May 3, 2025