ఆహా.. ఓ సక్సెస్ఫుల్ ఓటీటీ ప్లాట్‌ఫాం..అలరించే టాక్ షోలతోను ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తోంది. ఎంటర్టైన్మెంట్తోపాటు ఈ షో ద్వారా మానవీయ కోణాలను కూడా చూపెడుతున్నారు. నాని గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్లో క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన చిన్నారి జీవితాన్ని పరిచయం చేశారు. ఆమెకు బాలయ్యబాబు దగ్గరుండి వైద్యం చేయించారు. అలాగే, బ్రహ్మానందం పాల్గొంటున్న ఎపిసోడ్లో ఓ మరుగుజ్జు సక్సెస్ స్టోరీని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఆయన పేరే శివలాల్.. మూడు ఫీట్ల పొడువున్న శివలాల్ కారు డ్రైవింగ్ లైసెన్స్ సాధించి చరిత్ర సృష్టించారు. మరి ఆయన బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..