నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిరిస్మున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తున్నది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని ‘ఖం..ఖం. ఖంగుమంది శంఖం.. హరోంహర జఠాధర జయించరా’ అనే లిరికల్ వీడియోను కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పుజాదికాలు నిర్వహించి విడుదల చేశారు. అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివం మహదేవన్ ఆలపించారు. తమన్ స్వరకర్త. నిర్మాత మాట్లాడుతూ ‘బాలకృష్ణ శైలి హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తారు. భిన్న పార్శాలతో ఆయన పాత్ర సాగుతుంది’ అని తెలిపారు.